Thursday, July 7, 2016

భ్రమ


పరుగెత్తి పాలు తాగుతుంటే ఆ రుచి తెలుసా నీకు? ; నిలబడి నీళ్ళు తాగడం ఎంత చేదో తెలియడం లేదా ?

దూకి ఆలోచించడంలో  మజాఎప్పుడైనా రుచి చూసావా ? ఇంకా అలోచించి దూకుతానంటావా?

నీ పరుగుకు హిమాలయం అడ్డవుతుందా? నీ తపనను అమ్మ లాలి తీరుస్తుందా?

ఎడారిలో ఆనందం దొరుకుతుందేమో చూడవా? నడిసంద్రంలో దాహం తీరకుండా పోతుందా   ?

పరిభ్రమణంలో ముందుకెళ్లగలనని నిరూపించలేనా ? ప్రియ పరిష్వంగ సమయం వృధా అనిపించడం లేదా ?

వినువీధిలో ఉషోదయ విజయం కనిపించలేడా? నిశి రాత్రి విషాదం నిజం కాదని నమ్మలేవా ?

చైత్ర మాస చిగురు సింగారం చూస్తుంటే శిశిర శీతలం అసలు ఎప్పుడన్నా వస్తుందంటావా?