భ్రమ
పరుగెత్తి పాలు తాగుతుంటే ఆ రుచి తెలుసా నీకు? ; నిలబడి నీళ్ళు తాగడం ఎంత చేదో తెలియడం లేదా ?
దూకి ఆలోచించడంలో మజాఎప్పుడైనా రుచి చూసావా ? ఇంకా అలోచించి దూకుతానంటావా?
నీ పరుగుకు హిమాలయం అడ్డవుతుందా? నీ తపనను అమ్మ లాలి తీరుస్తుందా?
ఎడారిలో ఆనందం దొరుకుతుందేమో చూడవా? నడిసంద్రంలో దాహం తీరకుండా పోతుందా ?
పరిభ్రమణంలో ముందుకెళ్లగలనని నిరూపించలేనా ? ప్రియ పరిష్వంగ సమయం వృధా అనిపించడం లేదా ?
వినువీధిలో ఉషోదయ విజయం కనిపించలేడా? నిశి రాత్రి విషాదం నిజం కాదని నమ్మలేవా ?
చైత్ర మాస చిగురు సింగారం చూస్తుంటే శిశిర శీతలం అసలు ఎప్పుడన్నా వస్తుందంటావా?